కారా మాస్టారు పేరు చెప్పగానే ఆయన రాసిన 'యజ్ఞం' గుర్తుకు వస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawankalyan). సమాజంలో అట్టడుగు వర్గాల వారి బతుకు చిత్రాన్ని, జీవన సమరాన్ని అక్షరాల్లో చూపించారని కొనియాడారు. పెత్తందారీ వ్యవస్థలో అణగారిన వర్గాలు, పేదలు దోపిడీకి గురవుతున్న వైనాన్ని ఆలోచన రేకెత్తించేలా చెప్పారని పవన్ అన్నారు. తెలుగు కథా సాహిత్యం పట్ల వారు చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.
ప్రచురితమైన ప్రతి తెలుగు కథను భద్రపరచి, భావితరాలకు అందించేందుకు శ్రీకాకుళంలో కథా నిలయం నెలకొల్పి కారా మాస్టారు సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయమని పవన్ కొనియాడారు. కారా మాస్టారు మృతి తెలుగు సాహిత్యానికి... ముఖ్యంగా కథా సాహిత్యానికి తీరని లోటు అని.... వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్న పవన్ కల్యాణ్... కారా మాస్టారు కుటుంబానికి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చదవండీ... ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత