కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. సీఐటీయు ప్రధాన కార్యదర్శి రమణారావు మాట్లాడుతూ చట్టం ద్వారా కార్మికులు పెట్టుబడిదారులకు బానిసలుగా మారుతారన్నారు. చట్టాల సవరింపు కారణంగా 17 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రెండు లేబర్ కోట్లుగా మార్క్ చేసిందన్నారు. ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో వివిధ రంగాల నాయకులు స్వప్న పద్మావతి, అమర వేణి, అంజలి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు