ETV Bharat / state

నేనేం పాపం చేశానమ్మా!..ఏ చెత్తకుప్పలో పడేసినా బతికి ఉండేదాన్ని! - పలాసలో బతికుండగానే శిశువు హత్య వార్తలు

చిన్నారి బుజ్జి బుజ్జి పాదాలు చూస్తే..ఎంతో ఆనందంగా ఉంటుంది.ఇంకా కళ్లను , బోసి నవ్వులను చూస్తే.. ఆకలే వేయదు. ఎంతోమంది తల్లులు ఈ అనుభూతి కోసం వేచి చూస్తారు. అమ్మ అని పిలిపించుకోవాడానికి.. తొమ్మిదినెలలు ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ఇష్టంగానే భరిస్తారు. ప్రసవం కాగానే.. ఆమె ఆనంద భాష్పాలకు అవధే ఉండదు. ఏ తల్లికైనా ఇంతకంటే ఏం కావాలి.. జన్మధన్యమైంది అనుకుంటుంది. కానీ... కొంతమందికి మాత్రం పాప అంటే ఓ భారంగా.. ప్రసవం ఓ నరకంగా.. అందులోనూ ఆడపిల్ల అంటే.. దీని గురించి చెప్పడానికి మాటలే రావు. పాపకే చిన్న గాయం తాకితే.. ఆరోజంతా మనసు విలవిలాడుతుంది. అలాంటిది ఓ తల్లి మాత్రం... పుట్టిన శిశువును బతికుండగానే పూడ్చిపెట్టింది. ఈ అమానుషమైన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో జరిగింది.

The baby was killed while still alive at palasa
పలాసలో బతికుండగానే శిశువు హత్య
author img

By

Published : Jul 10, 2021, 8:21 AM IST

Updated : Jul 10, 2021, 9:01 AM IST

హమ్మయ్యా..! కొంచెం సేపైతే మా అమ్మ నన్ను గుండెలకు హత్తుకుంటుంది. రోజూ పొట్ట మీద చేయి వేసి.. సున్నితంగా తను స్పృశిస్తుంటే ఎంతో బాగుండేది. అమ్మ చేయి.. నేను బయటికి రాకుండానే తాకుతున్నాను అనే మధురానుభూతి ఇంకా నాకు గుర్తుంది. కొన్ని నిముషాల తర్వాత అమ్మ.. నన్ను ఎత్తుకోగానే మొదటిసారి అద్భుతమైన ప్రేమను చూస్తా!తన పెదాలతో నాకు ముద్దులు ఇస్తుంటే.. నాకు ఆనందం ఆగదేమో! అని లోలోపల అనుకుంటుండగానే పుట్టేశా! పుట్టగానే ఏడ్చా! ఇంకా అమ్మ నన్ను ఎత్తుకోవడమే ఆలస్యం. తన సున్నితమైన స్పర్శ.. మాతృప్రేమ కోసం వేచిచూస్తున్నా నాకు.. ఓ అంకుల్ కనిపించాడు. నన్ను తెల్లటి వస్త్రంలో చుట్టారు. నేనేమో నాకు చలి పెడ్తుందోమోనని కప్పారేమో కావచ్చు అని అనుకున్నా. తర్వాత అమ్మ నాతో రాలేదు. తనకి ఏదో చెప్పింది... చంపేయ్ అని!

హా నన్నేనా! మా అమ్మ నన్ను చంపమని చెప్పింది? ఎందుకు అలా అంది? ఎందుకు ఎందుకు అంటూ.. ఏడుస్తూనే ఉన్నా. నా ఏడుపు వాళ్లేవరిని కరిగించలేదా. కొంచెం కూడా జాలనిపించలేదా. చిన్నపిల్లని..ఇప్పుడే పుట్టాను కదా! ఇంకా నా చిన్ని పాదాలు, ఎవరికీ పాపం చేయని నా కళ్లు.. నా చిట్టి చేతులు వాళ్లకి కనిపించలేదా.. కనీసం జాలి కూడా రాలేదా? నేను ఎవరికి చెప్పాలి? నేను బయటికి వచ్చాక నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి అమ్మ. నాకు మాటలు కూడా రావు. నా చిన్ని చేతులతో ఎలా రాయగలను. నన్నెందుకు చంపుతారు? నేనేం నేరం చేశా! బహుశా అమ్మాయి అనా.. ఐతే ఏంటి! లోకంలో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కదా.. మా అమ్మ కూడా.. వాళ్ల అమ్మ ఇంట్లో తనూ ఓ గారాలపట్టీ కదా. ఇలా ఏడుస్తూ ఉంటే.. ఆ అంకుల్ మట్టిలో పెట్టాడు.. నేను ఏడుస్తూనే ఉన్నా. అమ్మా.. అమ్మా.. అని! నా పిలుపు మీకు వినిపించలేదా..! నా ఏడుపు నిన్ను కనికరించలేదా అమ్మా! చంపేయడం ఎందుకమ్మా! ఎవరికైనా ఇవ్వాల్సింది? ఏ చెత్తకుప్పలో పడేసినా.. బతికి ఉండేదాన్ని. ఎవరో ఇంట్లో.. ఎవరినో అమ్మా అని పిలిచేదాన్ని. ఎందుకమ్మా.. బతికి ఉండగానే పూడ్చిపెట్టమన్నావ్?

ఇదంతా.. తల్లి గర్భం నుంచి అందాల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకున్న ఓ శిశువు ఆవేదన. ఆ చిన్నారికే మనసంటూ ఉంటే.. ఇంతగా ఆవేదన చెందేది. ఇంతకంటే ఎక్కువే కన్నీళ్లు పెట్టుకునేది. పోతున్న తన ప్రాణాన్ని తలుచుకుని తల్లి గర్భంలోనే కుమిలికుమిలిపోయేది. చదువుతుంటేనే మనసును కలిచివేస్తున్నట్టు.. గుండెలు పిండేసినట్టు.. ఆవేదనతో మనసు కంటతడి పెడుతున్నట్టు అనిపిస్తోంది కదా. నిజమే. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పలాస - కాశీబుగ్గ పరిధిలోని ఓ నర్జన ప్రాంతంలో.. బతికుండగానే ఆమె తల్లి చిన్నారిని పూడ్చి పెట్టించింది. నందిగాం మండలానికి చెందిన ఓ మహిళ గర్భం దాల్చటంతో గురువారం కాశీబుగ్గలో ఓ వైద్యుడి వద్దకు వచ్చింది. ఆమెకు ప్రస్తుతం ఏడో నెల. ఏమైందో తెలియదు గానీ.. ఆమె కోరడంతో వైద్యుడు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు.

ఆ తల్లి తనకు ఆడపిల్ల పుట్టిందని.. అక్కడ ఉన్న ఓ వ్యక్తికి ఆ బిడ్డను తెల్లని వస్త్రంలో చుట్టి తీసుకెళ్లి ఖననం చేయమంది. తీసుకెళ్లిన ఆ వ్యక్తి బిడ్డను ఖననం చేసే ముందు ఫొటోలు, వీడియో తీయగా అవి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఆ బిడ్డను బతికుండగానే పాతిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ శంకరరావును అడగ్గా.. విషయం తమ దృష్టికి రాలేదన్నారు. శిశువు తల్లి కాశీబుగ్గలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:

స్వగ్రామానికి జవాన్ జశ్వంత్ రెడ్డి మృతదేహం.. నేడు అంత్యక్రియలు

Last Updated : Jul 10, 2021, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.