శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా కార్యాలయంలో జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూన రవికుమార్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నామినేషన్ వేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నామినేషన్ పత్రాలతో జత చేసిన పత్రాల ప్రతిని పరిశీలించాలన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ మొండివైఖరి వీడి ఎన్నికలకు సహకరించాలి: రామకృష్ణ