ETV Bharat / state

అచ్చెన్నాయుడి భార్యకు తెదేపా నేతల పరామర్శ - srikakulam news

మాజీమంత్రి అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను పలువురు తెదేపా నేతలు పరామర్శించారు. అచ్చెన్నాయుడి భార్యకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

Tdp leaders visit Achenennadu house in srikakulam
అచ్చెన్నాయుడి భార్యకు తెదేపా నేతల పరామర్శ
author img

By

Published : Jun 12, 2020, 10:56 PM IST

అచ్చెన్నాయుడి భార్యకు తెదేపా నేతల పరామర్శ

శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సహా పలువురు తెదేపా సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. జిల్లా తెదేపా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మల్లా బాలకృష్ణ, పలు మండలాల తెదేపా అధ్యక్షులు, ముఖ్యనేతలు పరామర్శించిన వారిలో ఉన్నారు.

అసలేం జరిగింది...

తెదేపా శాసనసభాపక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్టు చేయడంతో ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కిపడింది. ఉదయం 7.20గంటలకు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది ఆయన ఇంటిని చుట్టుముట్టారు. గేటుకు తాళం వేసి ఉండటంతో రక్షణగోడను దూకి రెండో అంతస్తులో ఉన్న ఆయన గదికి నేరుగా ప్రవేశించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు వచ్చే సమయానికి ఆయన భార్య స్నానపు గదిలో ఉండగా, ఆమె వచ్చేంతవరకు ఆగాలని, ముందురోజే శస్త్రచికిత్స జరిగినందున తన మందులు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లినట్లు అచ్చెన్నాయుడు భార్య విజయమాధవి తెలిపారు. క్షణాల్లో సంఘటన జరిగిందని ఆమె చెప్పారు.

ధైర్యం చెప్పిన చంద్రబాబు...

తెదేపా అధినేత చంద్రబాబు... అచ్చెన్నాయుడు భార్యకు ఫోను చేసి సంఘటన వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. పార్టీ అన్నివిధాలా అండగా నిలుస్తుందని... అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పార్టీ అభిమానులు నిమ్మాడకు రాకుండా టెక్కలి, కోటబొమ్మాళి, నిమ్మాడ కూడళ్లలో పోలీసులను మోహరించారని చంద్రబాబుకు ఆమె వివరించారు. నిమ్మాడ గ్రామంలో కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని... ప్రజలు గుమిగూడవద్దని పదేపదే పోలీసులు ప్రకటనలు చేస్తున్నారని... అచ్చెన్నాయుడును అరెస్టు చేయడానికి వచ్చిన వందలాది మంది పోలీసులకు కోవిడ్ నిబంధనలు వర్తించవా అని ఆమె ప్రశ్నించారు.

ఇవీ చదవండి: అచ్చెన్నాయుడి కిడ్నాప్​న​కు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.