ETV Bharat / state

రైతులను మభ్యపెట్టేలా తమ్మినేని హామీలు: కూన రవికుమార్ - tdp leader kuna ravikumar latest news

శ్రీకాకుళం జిల్లాలోని తండ్యాం, మలకం గ్రామాలకు మడ్డువలస ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పడం విడ్డూరంగా ఉందని తెదేపా నేత కూన రవికుమార్ అన్నారు. మరోవైపు నారాయణపురం వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతామని స్పీకర్ చెప్పడాన్ని తప్పుబట్టారు.

kuna ravikumar
kuna ravikumar
author img

By

Published : Nov 20, 2020, 6:35 PM IST

రైతులను మభ్యపెట్టేలా శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతున్నారని శ్రీకాకుళం తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తండ్యాం, మలకం గ్రామాలకు మడ్డువలస ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని స్పీకర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మడ్డువలస ప్రాజెక్టు ఈ రెండు గ్రామాలకు ఉన్నందున.... చుక్క నీరు కూడా అందదని అన్నారు. అందువల్లే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేశామని వెల్లడించారు. ఆ పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు నారాయణపురం వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడతామని స్పీకర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కూన రవికుమార్ అన్నారు. ఈ నిర్మాణం చేపడితే బూర్జ మండలంలోని పలు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని చెప్పారు.

ఇదీ చదవండి

ట్రంప్ తరహాలోనే జగన్ వ్యవహారం: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.