వైకాపా కార్యకర్తల కంటే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో తెదేపా తలపెట్టిన బైక్ ర్యాలీని పోలీసులు నిరాకరించిన కారణంగా.. ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో కలిసి అచ్చెన్నాయుడు ర్యాలీగా వెళ్లారు. కొంతమంది తెదేపా నాయకులకు టెక్కలి పోలీసులు నిర్భంధించారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో తెలుగదేశం పార్టీ లేకుండా చేయాలని కలలు గన్నారని అన్నారు.
2024 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం తథ్యం అని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. పాదయాత్రలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. నేడు నిత్యావసర వస్తు ధరలు, చమురు ధరలు విపరీతంగా పెంచి పెదలపై పెను భారం మోపారని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.
ఇదీ చదవండి:
'గండికోట నిర్వాసితులకు.. నేటికీ రూపాయి పరిహారం ఇవ్వలేదు'
RK Roja: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా.. విద్యార్థులకు సోషల్ పాఠాలు