ETV Bharat / state

'కరోనా జ్వరం లాంటిదే అయితే... సీఎం ఇల్లు దాటరెందుకు?'

author img

By

Published : Apr 28, 2020, 1:40 PM IST

Updated : Apr 28, 2020, 5:45 PM IST

కరోనాపై సీఎం జగన్​ వ్యాఖ్యలను తెదేపా నేత అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. కరోనా జ్వరం లాంటిదే అయితే తాడేపల్లిలోని ఇల్లు దాటి సీఎం బయటకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో పెండింగ్​లో ఉన్న 1600కి పైగా టెస్టుల ఫలితాలను వెల్లడించాలని ట్వీట్ చేశారు.

achennaidu vs cm jagan
achennaidu vs cm jagan

కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి జగన్‌ రోజుకో మాట చెబుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనా జ్వరం లాంటిదే తగ్గిపోతుందంటున్న జగన్....తాడేపల్లిలోని ఇల్లు దాటి బయటకు ఎందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. వైరస్‌తో కూడా సహజీవనం చేయగల సత్తా ఆయనకు ఉన్నా.... తినడానికి తిండిలేక అల్లాడుతున్న పేదలకు లేదని ఎద్దేవా చేశారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీనే నెంబర్‌వన్ అని ప్రకటించుకున్న జగన్​... వైరస్ వ్యాప్తి వేగంలోనూ, మరణాల్లోనూ తక్కువ రికవరీలోనూ దక్షిణాదిలోనే మన రాష్ట్రం ముందున్నదన్న సంగతి చెప్పడం లేదన్నారు. విశాఖ‌ప‌ట్నంలో కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్యపెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 1,600కి పైగా పెండింగ్‌లో ఉన్న పరీక్షల ఫ‌లితాలు వెల్లడిస్తే లెక్క తేలిపోతుందని చెప్పారు. పాజిటివ్ వ‌స్తే డిశ్చార్జి చేసి, నెగిటివ్ అయితే వైద్యం చేస్తున్నప్పుడే జగన్‌ పాల‌న ఎంత అధ్వానంగా ఉందో అర్థమైందని ఎద్దేవా చేశారు. వైకాపా నేత రోజూ చంద్రబాబును విమర్శించటం మాని కరోనా కట్టడి కోసం పనిచేయాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

ఇదీ చదవండి

'భవిష్యత్తులో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది'

Last Updated : Apr 28, 2020, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.