శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ, కోటబొమ్మాళి మండలాల్లో.. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యకాండపై.. తెలుగుదేశం నేతలు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైకాపాయేతర అభ్యర్థులను.. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
నిమ్మాడలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని.. ఎస్ఈసీకి తెదేపా నేతలు వర్ల రామయ్య.. అశోక్బాబు ఫిర్యాదు చేశారు. కోటబొమ్మాళి మండలంలో ఉద్రిక్త ఘటనలకు సంబంధించి స్థానిక సీఐ, డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: