ETV Bharat / state

శ్రీకాకుళంలో వైఎస్సార్​ బీమా చెక్కులు పంపిణీ చేసిన తమ్మినేని సీతారాం - ysr insurance scheme news

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం నుంచి వైఎస్సార్​ బీమా ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన పాల్గొన్నారు.

Tammineni Sitaram
వైఎస్సార్​ బీమా చెక్కులు అందిస్తున్న తమ్మినేని సీతారాం
author img

By

Published : Apr 1, 2021, 8:21 AM IST

పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశ పెట్టిందని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయం నుంచి వైఎస్సార్​ బీమా ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సభాపతి పాల్గొన్నారు. అర్హులైన వారికి బీమా చెక్కులను అందించారు. జిల్లాలో 408 మంది పేద వారు ఈ పథకం కింద 8 కోట్ల 76 లక్షలను పొందారని చెప్పారు.

కేంద్రం చేతులెత్తేసినా.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ మరణించిన 12 వేల 39 మంది కుటుంబాలకు మానవతా దృక్పథంతో.. బీమాకు సమానమైన 2 వందల 54 కోట్ల మొత్తాన్ని చెల్లించామని తెలిపారు.

విశాఖ జిల్లా

కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయి.. వైఎస్సార్​ బీమా అందని వారిని ప్రత్యేకంగా గుర్తించి ఆదుకుంటామని ప్రభుత్వ విప్​ ముత్యాలనాయుడు అన్నారు. దేవరాపల్లిలోని వెలుగు కార్యాలయం వద్ద వైఎస్సార్ బీమా నగదు చెక్కుల పంపిణీ చేపట్టారు. నియోజకవర్గంలోని మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడు మండలాలకు చెందిన 38మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున, ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం 40 కుటుంబాలకు రూ.86లక్షలు విప్​ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి: ఉప ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.