ETV Bharat / state

యువతి అనుమానాస్పద మృతి..ప్రేమ వ్యవహారమే కారణమా? - ఒడిశా యువతి అనుమానాస్పద మృతి

ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో జరిగింది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని మృతిరాలి తండ్రి ఆరోపించారు.

suspicious death
suspicious death
author img

By

Published : Oct 15, 2021, 11:02 PM IST

Updated : Oct 16, 2021, 3:34 AM IST

శ్రీకాకుళం జిల్లా.. సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు సముద్ర తీరం సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు ఒడిశాలోని పర్లాఖెముండి సమీపంలోని దవిడిగాం గ్రామానికి చెందిన సిరిపురం ఉచిత(21)గా పోలీసులు గుర్తించారు.

పురుగుల మందు తాగి...

దవిడిగాం గ్రామానికే చెందిన ఆటో డ్రైవర్ బెహరా దుర్గాప్రసాద్ తో కలిసి ద్విచక్ర వాహనంపై యువతి.. భావనపాడు వచ్చింది. కాసేపటి తరువాత తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి చావుబతుకుల మధ్య ఉండటాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లా నౌపడా పోలీసులు విచారణ చేపట్టి మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

డిగ్రీ పూర్తిచేసిన ఉచిత .. ఆటోడ్రైవర్ బెహరా దుర్గాప్రసాద్ ప్రేమ వలలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆటోడ్రైవర్ కు మరో అమ్మాయి తో కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదివే రొజుల్లో 'ఉచిత' ను కళాశాలకు తీసుకెళ్లి, తెచ్చే సమయంలో ప్రేమపేరుతో దగ్గరయ్యాడని, విషయం తెలిసి ఓసారి మందలించినట్లు మృతురాలి తండ్రి గణేష్​.. పోలీసులకు తెలిపారు. కొద్దినెలల క్రితం జీవనోపాధి కోసం కుటుంబంతో సహా విశాఖపట్నం లో ఉంటున్నామని, డిగ్రీ సర్టిఫికెట్ కోసం తన కుమార్తెను గురువారం గ్రామానికి పంపామని తండ్రి తెలిపారు. ఆటో డ్రైవర్ నమ్మకంగా వంచించి పథకం ప్రకారం హత్య చేశాడని వారు ఆరోపించారు.

ఇదీ చదవండి: పొలాల్లోకి దూసుకెళ్లిన మంత్రి కాన్వాయ్.. తప్పిన ప్రమాదం..

Last Updated : Oct 16, 2021, 3:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.