ETV Bharat / state

జిల్లాలో పక్కాగా అమలవుతోన్న ఆదివారం లాక్​డౌన్​

author img

By

Published : Aug 30, 2020, 4:32 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం లాక్​డౌన్ పటిష్టంగా అమలవుతోంది. మార్కెట్లలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం లాక్​డౌన్ పాటించాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. అత్యవసరాలు మినహా అన్నీ దుకాణాలు మూసే ఉన్నాయి.

Sunday lockdown in srikakulam dst are implementing strictly

కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా.. శ్రీకాకుళంలో సంపూర్ణ లాక్​డౌన్ నిర్వహించారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వారం నుంచి ప్రతి ఆదివారం లాక్​డౌన్​గా కలెక్టర్ నివాస్ ప్రకటించారు. ఆదివారం రోజున ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లు, ఇతర ప్రదేశాల్లో తిరుగుతున్నారు. అధిక రద్దీకి కారణమవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం లాక్​డౌన్ చర్యలకు ఉపక్రమించింది. అయితే ప్రజల్లో అప్రమత్తత పూర్తిస్ధాయిలో లేకపోవటంతో కేసుల సంఖ్య జూన్ నుంచి ఇప్పటివరకు బాగా పెరుగుతున్నాయన్నారు. కేవలం మందుల దుకాణాలకే అనుమతించిన కలెక్టర్ పాలు, బ్రెడ్​కు మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచారు. అత్యవసర వైద్యం కోసం ఏ సమయంలోనైనా అనుమతిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ ప్రకటించారు.

ఇదీ చూడండి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.