శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, ముచ్చెందర గ్రామానికి చెందిన మోహనరావు చంద్రగిరి జాతీయ రహదారిపై మృతి చెందాడు. గ్రామానికి చెందిన 9 మంది వలస కూలీలు గత 2 నెలలుగా చంద్రగిరి మండలంలో ఓ ప్రైవేటు కంపెనీలో కూలీ పనులు చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు తమ స్వగ్రామానికి వెళ్లాలని శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చంద్రగిరి జాతీయ రహదారిపైకి వచ్చారు.
వాహనం కోసం రోడ్డు పక్కన వారధిపై కూర్చుని నిరీక్షిస్తుండగా మోహనరావు మాత్రం కొద్దిసేపు నిద్రిస్తానని తోటి కూలీలతో చెప్పి పడుకున్నాడు. రాత్రి 11 గంటలకు ఓ లారీ ఆగగా.. తోటి కూలీలు మోహనరావుని నిద్ర లేపారు. అతను ఎంతకూ లేవకపోయేసరికి 108 అంబులెన్స్‌కు సమాచారం అదించారు. సిబ్బంది మోహనరావును పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.
సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: