శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కరోనా ప్రత్యేక వార్డును కలెక్టర్ నివాస్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. కరోనా వ్యాప్తి చెందకుండా... కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను తీసుకుంటోందని ఆయన అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. అలాగే కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశామని చెప్పారు. అంతకు ముందు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు.
ఇదీ చదవండి: