ప్రజల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. ఎస్. అప్పలరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలకు అందిస్తున్నామన్నారు. నాడు-నేడు పథకం ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేశామని చెప్పారు. అమ్మఒడి పేరుతో డబ్బులు అందిస్తూ.. ప్రతి విద్యార్థిని చదివిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మరో అవకాశం ఇస్తే.. ఇళ్లను నాశనం చేస్తారు: లోకేశ్