కరోనా వైరస్ కారణంగా భయపడాల్సిన అవసరం లేదని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు పాలవలస విక్రాంత్ పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండి సోకకుండా నివరణ చర్యలు తీసుకోవడం మంచిదన్నారు. కొవిడ్ బారిన పడిన విక్రాంత్.. జిల్లా కోవిడ్ ఆసుపత్రి జెమ్స్ లో చేరి చికిత్స పొందారు. చికిత్స అనంతరం కోలుకుని నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తమ కుటుంబంలోని ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారని.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తక్షణం ఆసుపత్రిలో చేర్పించారన్నారు. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణ, ఆసుపత్రిలో సౌకర్యాలు, పౌష్టికాహారం, మందుల దృష్ట్యా త్వరగా కోలుకున్నామని విక్రాంత్ చెప్పారు. త్వరగా కోలుకోవడం సంతోషంగా ఉందన్న విక్రాంత్.. కొవిడ్ బాధితులు ఎవరూ భయపడకుండా ఆత్మస్ధైర్యం కోల్పోకుండా ఉండాలని విక్రాంత్ కోరారు.
ఇదీ చదవండి:'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'