ETV Bharat / state

అనవసరంగా బయటకు వస్తే రంగు పడుద్ది.. ఆ తర్వాత..! - srikakulam police take strict action on lockdown negligence people

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని పదే పదే చెబుతున్నా కొంతమంది వినడం లేదు. ఇలాంటి వారిపై సిక్కోలు పోలీసులు వినూత్న రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. వాహనచోదకుల నిర్లక్ష్యానికి.. పోలీసులు రంగుతో సమాధానం చెబుతున్నారు.

అనవసరంగా బయటకు వస్తే రంగు పడుద్ది.. ఆ తర్వాత..!

author img

By

Published : Apr 18, 2020, 12:57 PM IST

Updated : Apr 18, 2020, 7:53 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వారికి కౌన్సిలింగ్​ ఇస్తున్నా.. కొందరి తీరు మారకపోవడం వల్ల పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. పదే పదే బయటకు వస్తున్న వారి వాహనాలకు ఎరుపు రంగుతో మార్క్​ వేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదని పెట్రోల్​ బంకుల యాజమాన్యానికి ఆదేశాలిచ్చారు. ఇలాగైనా అనవసరంగా బయటకు వచ్చే వారిని నియంత్రించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు కసరత్తులు

Last Updated : Apr 18, 2020, 7:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.