శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సన్యాసి నీలాపురం గ్రామం వద్ద ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒడిశా నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 459 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారుతో పాటు ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకడైన పరపటి కృష్ణంరాజు అనే వ్యక్తి మెళియాపుట్టి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తమకు వచ్చిన సమాచారం మేరకు దాడిలు చేసి నిందితులను పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఏఈఎస్ భార్గవ్ తెలిపారు.
ఇవీ చూడండి...