శ్రీకాకుళం జిల్లా రాజాం సామాజిక ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపమవుతోంది. మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక రోగులు నానా అవస్థలు పడాల్సివస్తోంది. మరుగుదొడ్లు శుభ్రంగా లేని కారణంగా... బహిర్భూమికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు. దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి-దుబాయ్లో ఆంధ్రుడి అదృశ్యం.. 40 రోజులైనా దొరకని ఆచూకీ