ETV Bharat / state

మరిన్ని కరోనా పరీక్షల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌తో మాట్లాడారు. మూడో విడత ఇంటింటి సర్వే 95శాతం పూర్తైందని కలెక్టర్ తెలిపారు. మరిన్ని కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

srikakulam District administration steps to make more corona tests
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​
author img

By

Published : Apr 11, 2020, 2:50 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్న వారి నుంచి సేకరిస్తున్న నమూనాల సంఖ్యను వైద్య అధికారులు రోజురోజుకూ పెంచుతున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్​లో జిల్లా కలెక్టర్‌ నివాస్‌తో మాట్లాడారు. నిన్న 108 నమూనాలను పరీక్షలకోసం విశాఖపట్నం విమ్స్‌కు పంపించారన్నారు. మొత్తం 549 నమూనాలను పరీక్షలకై పంపించగా ..అందులో 278 నమూనాలకు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయని తెలిపారు.

మూడో విడత సర్వే 95 శాతం వరకు పూర్తయిందని కలెక్టర్‌ వెల్లడించారు. గడువు పూర్తయినప్పటికీ 1,042 మందిని ఇంకా గృహ నిర్బంధంలోనే ఉంచి వారిని పరిశీలిస్తున్నామన్నారు. 60 ఏళ్ల పైబడిన వారి నుంచి నమూనాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల్లో వెయ్యి పడకలు అందుబాటులో ఉన్నాయని... 2 రోజుల్లో మరో వెయ్యి పడకలను అదనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

ఇదీ చూడండి:

నరసన్నపేటలో వాకర్లు నడకలు..పీఎస్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.