మిల్లర్లు ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నివాస్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ధాన్యం కొనగోలు కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురు రైతులు ధాన్యం కొనగోలులో ఉన్న సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఒక రైస్ మిల్లో రెండు కిలోల వరకూ అదనంగా ధాన్యం ఇస్తేనే కొనగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేయటంతో ఆ రైస్ మిల్లర్లపై ఇది పద్ధతి కాదని మండిపడ్డారు. ఇక నుంచి నేరుగా పొలంలోనే ధాన్యం కొనగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే ధాన్యం కొనగోలు చేయాలని ఆదేశించారు. నిల్వలకు సమస్య లేకుండా ఎఫ్సీఐ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: కంబకాయలో అగ్ని ప్రమాదం.. ధాన్యం బస్తాలు దగ్ధం