శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది మే నాటికి ప్రతి ఎకరాకు సాగునీరందించేలా పనులను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జలవనరులశాఖ, డ్వామా అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు పూర్తి చేసేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. జిల్లాలో సరిపడా వనరులున్నా పూర్తి స్థాయిలో సాగునీటిని సరఫరా చేయకపోవడం భావ్యం కాదన్నారు. వంశధార కుడి, ఎడమ కాలువల పనులకు ఇప్పటి వరకు రూ.70 కోట్లు ఖర్చు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఉపాధి పథకం ద్వారా సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పలుచోట్ల చేపట్టిన చెరువు పనుల్లో నాణ్యత లోపించిందన్నారు.
ఇదీ చదవండి: 'వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు'