చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా పాలనాధికారి జె.నివాస్.. అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా బాలల రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చైల్డ్ కేర్ కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే ఆ కేంద్రాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. చైల్డ్ కేర్ కేంద్రాల్లో చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. దస్త్రాలు సక్రమంగా నిర్విహించాలని స్పష్టం చేశారు.
కేంద్రాల్లోని చిన్నారులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని.. జువైనల్ కోర్టు ప్రధాన జడ్జి కె.రాణి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 చైల్డ్ కేర్ కేంద్రాల్లో 315 మంది చిన్నారులు ఉన్నట్లు.. జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి.రమణ తెలిపారు. వారి రక్షణకు గ్రామ, పట్టణ, మండలస్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. హిరమండలానికి చెందిన విద్యా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురక్షిత గ్రామ జ్యోతి ప్రాజెక్టు సమన్వయకర్త ప్రసాదరావు రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: