శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అధికారులతో శాసనసభాపతి తమ్మినేని సీతారాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు, ప్రధాన సాగునీటి కాలువలు, పిల్ల కాలువల మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. పల్లెల్లో రహదారులు, కాలువల పనులు పూర్తిచేసి గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. సచివాలయాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించాలని కోరారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి