శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఉన్న అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా ఖోఖో క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. ఆరు రాష్ట్రాల నుంచి 60 విశ్వవిద్యాలయాలకు చెందిన క్రీడాకారులు మూడు రోజుల పాటు హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్‌కు ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, మైసూర్ యూనివర్సిటీ చెందిన జట్లు చేరుకున్నాయి. వీరికి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించి అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీ జట్టు విన్నర్‌గా నిలవగా, కలకత్తా విశ్వవిద్యాలయం జట్టు రన్నర్‌గా నిలిచింది. నాగార్జున, మైసూర్ యూనివర్సిటీ టీం తృతీయ, నాలుగో స్థానాలను కైవసం చేసుకున్నాయి.
హాజరైన ఉపముఖ్యమంత్రి
క్రీడా ముగింపు వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా పతకాలను అందజేశారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి అగ్రస్థానంలో నిలవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రీడలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి :