ETV Bharat / state

ట్రాక్టర్​పై మృతదేహం తరలింపు.. సోంపేట పంచాయతీ ఈవో సస్పెండ్​ - srikakulam collector suspended sompeta eo news

కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్టర్​పై తరలించిన వ్యవహారంపై శ్రీకాకుళం కలెక్టర్​ చర్యలు ప్రారంభించారు. సోంపేట పంచాయతీ ఈవోను.. కలెక్టర్​ నివాస్​ సస్పెండ్​ చేశారు. మరో ఇద్దరి అధికారులకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.

ట్రాక్టర్​పై మృతదేహం తరలింపు.. సోంపేట పంచాయతీ ఈవో సస్పెండ్​

author img

By

Published : Jun 27, 2020, 9:19 PM IST

శ్రీకాకుళం జిల్లా సోంపేట పంచాయతీ ఈవో జ్యోతీశ్వరరెడ్డిని.. కలెక్టర్ నివాస్​​ సస్పెండ్​ చేశారు. శుక్రవారం కరోనా లక్షణాలతో మృతి చెందిన వ్యక్తిని ట్రాక్టర్​పై తరలించిన ఘటనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సోంపేట తహసీల్దార్​, ఎంపీడీవోలకు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. కొవిడ్​ మృతుల తరలింపుపై స్పష్టమైన విధానాలు విడుదల చేశారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో కరోనా లక్షణాలతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని మున్సిపల్​ సిబ్బంది ట్రాక్టర్​పై తరలించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం జగన్​ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు.

ఇదీ చూడండి..

పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య: కుమారుడు, కుమార్తె మృతదేహాలు లభ్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.