శ్రీకాకుళంలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎంపిక కోసం సెర్చ్ కమిటీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నామినిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి సీఆర్ విశ్వేశ్వరరావును నియమించారు. ఈసీ నామినీగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రభాకర్‌రావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. యూజీసీ నామినీగా మధ్యప్రదేశ్‌లోని మహాత్మా గాంధీ చిత్రకుట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎన్. సి.గౌతమ్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి : సీసాల్లో నిర్మాణాలు.. సుద్దముక్కలపై అద్భుతాలు