శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని నల్ల చెరువులో.. కొంగర గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు ఒక్కసారిగా చెరువులో బోల్తా పడడంతో ఓ విద్యార్థి బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులను చెరువులో నుంచి ఒక్కొక్కరిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థి బడివానిపేటకు చెందిన మైలపల్లి రాజు(8)గా గుర్తించారు. చెరువులో బోల్తా పడిన బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద గురించి తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని, సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు.
ఇదీ చదవండి : సీజ్ చేసిన ఖనిజ శుద్ధీకరణకు టెండరు..