శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల రంగవల్లులు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలు అలరించాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, తప్పెటగుళ్ల నృత్యాలు, భోగి మంటలు, పిండి వంటలు మొదలైనవి సంక్రాంతి పండుగను కళ్ళకు కట్టాయి. విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకుంటే..యువత కేరింతలు కొట్టి సందడి చేశారు.
ఇదీ చదవండి: