కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మోటార్లకు, మీటర్లు బిగింపు ప్రతిపాదన వచ్చిందని శైలజానాథ్ అన్నారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత రైతులపై ఆర్థిక భారం పడుతుందని.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి.. ఈ ప్రతిపాదన ఉపసంహరించుకుందని తెలిపారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మోటార్లకు మీటరు బిగింపుపై తీసుకొచ్చే జీవోతో రైతులకు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మోసం చేశారని.. పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనా పరిస్థితి మారలేదు: హైకోర్టు