ETV Bharat / state

రాజాంలో లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు - శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి

లారీ ఢీకొని ఓ వృద్ధురాలి కాళ్లు విరిగిన ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగింది. పాలకొండ రోడ్డు అంబేడ్కర్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఆమెను ఢీ కొట్టింది. కాళ్లపై నుంచి లారీ వెళ్లిపోవడంతో బాగెమ్మ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. చికిత్స కోసం ఆమెను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

road accident at raajam
శ్రీకాకుళం జిల్లా రాజాంలో లారీ ఢీకొని ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలు
author img

By

Published : Jan 3, 2021, 2:19 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాంలో లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాజాం మండలం కంచరాం గ్రామానికి చెందిన పొట్నూరు బాగెమ్మ(55) కూలి పని నిమిత్తం రాజాం వచ్చింది. పాలకొండ అంబేడ్కర్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన లారీ ఆమెను ఢీకొట్టింది. కాళ్ళపై నుంచి లారీ వెళ్లిపోవడంతో బాగెమ్మ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. చికిత్స కోసం ఆమెను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాగెమ్మకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.