నిబంధనలు అతిక్రమిస్తే రంగు పడుద్ది అంటున్నారు పోలీసులు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తుండగా, వాహనచోదకులు అడ్డు అదుపు లేకుండా బయట తిరుగుతున్నారు. వీరిని కట్టడి చేయటానికి పోలీసులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో ప్రధాన రహదారిపై పలు వాహనాలకు ఎరుపు రంగు వేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు ఇలా ఎరుపు రంగు వేయడం ద్వారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. మడపాం టోల్గేట్ వద్దకు వచ్చిన వాహనాలును అడ్డుకోవటంతో పెద్ద ఎత్తున వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. నరసన్నపేట ఎస్సై సత్యనారాయణ, నేతృత్వంలో పోలీసులు వాహన రాకపోకలను అదుపు చేెశారు.
ఇదీ చదవండి: ఇళ్లకు స్టిక్కర్ అంటించేందుకు వెళ్లిన వాలంటీర్‌పై దాడి