మద్యం బాటిల్లో ఎలుక.. అవాక్కయిన మందుబాబు..! - rat at wine bottile in srikakulam dst rajam
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ ప్రభుత్వ మద్యం షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్లో ఎలుక పిల్ల దర్శనమిచ్చింది. ఓ వ్యక్తి పాలకొండ రోడ్డులో ఉన్న మద్యం దుకాణంలో బాటిల్ కొనుగోలు చేశాడు. బాటిల్ తెరిచేందుకు ప్రయత్నించగా అందులో ఎలుక పిల్ల ఉండటంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకుని మద్యం బాటిళ్లను పరిశీలించారు. అధికారుల తీరుపై పలువురు మద్యం బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు.