శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ వర్షాలతో రైతులు లాభపడతారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 17 వరకు జిల్లాలో వానలు కొనసాగే అవకాశం ఉందని.. వాగులు వంకలు పొంగే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని కోరారు.
ఇదీ చదవండి:
నీటిపై చిన్నారుల మృతదేహాలు.. అపస్మారక స్థితిలో తల్లి, మరో వ్యక్తి!