ETV Bharat / state

ముందస్తు సంక్రాంతి సంబరాలు.. రంగవల్లులతో ఆకట్టుకున్న యువతులు - నరసన్నపేట డిగ్రీ కళాశాలలో సంక్రాంతి వేడుకలు

Pre-celebration of Sankranti festival in AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జీజీహెచ్​లో పనిచేస్తున్న నర్సులు పరిపాలన భవనం వద్ద ముగ్గులు వేశారు. ఆస్పత్రి ప్రధాన రహదారి మొత్తం రంగవల్లులతో నింపారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలు ధరించి సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

Pre-celebration of Sankranti festival
రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 10, 2023, 9:50 PM IST

Pre-Sankranti festival in various districts in AP: రాష్ట్రంలో సంక్రాంతి పండగ శోభ ముందుగానే వచ్చింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు ముందస్తుగా పండగను నిర్వహించారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లోని వివిధ కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కట్టిపడేశాయి. కళాశాలలో రంగవల్లులతో యువతులు తమ ప్రతిభను చాటుకోగా.. యువకులు పట్టు పంచలతో దర్శనమిచ్చారు. భోగి మంటలను పేర్చి మందస్తు సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాచుర్యాన్ని వివరించే విధంగా విద్యార్థులు పలు ప్రదర్శనలు చేపట్టారు. భోగి మంటలు కొత్త బియ్యంతో పాయసం వంటకాలు నిర్వహించారు. కోలాటంతో విద్యార్థులు సందడి పంచుకున్నారు.

ప్రకాశం జిల్లా: ఒంగోలు భాష్యం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. బోగి మంటలు, రంగు రంగుల ముగ్గులతో విద్యార్థులు సందడి చేశారు.. అటపాటలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

పల్నాడుజిల్లా: ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ఆయన సతీమణి ఉమాదేవి ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం సంక్రాంతి సంబరాలలో భాగంగా.. ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో జిల్లాలోని పలు పోలీసుస్టేషన్​లలో పని చేస్తున్న మహిళా పోలీసు సిబ్బంది, పోలీసుల సతీమణులు, సచివాలయాలలో పనిచేస్తున్న మహిళా పోలీసులు పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు.

రాష్ట్రంలో ముందే సంతరించుకున్న సంక్రాంతి శోభ

విశాఖ: జీజీహెచ్​లో పనిచేస్తున్న నర్సులు పరిపాలన భవనం వద్ద ముగ్గులు వేశారు. ఆస్పత్రి ప్రధాన రహదారి మొత్తం రంగవల్లులతో నింపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.