ETV Bharat / state

పార్టీల మధ్య పోరు... కుళాయి నీళ్లు రావు..

పార్టీల మధ్య రగడ..కుళాయి నీళ్ల రాకుండా చేసేంత వరుకు వచ్చింది. తాము నాలుగు కుళాయిలు వేశాం..తాము ఐదు కుళాయిలు వేస్తున్నాం అంటూ ఇరు పార్టీలు విభేదాలు తెచ్చుకుని చివరకు రెండు నెలలుగా గ్రామానికి తాగేందుకు నీరు లేకుండా చేశారు.

author img

By

Published : Sep 11, 2019, 9:05 AM IST

కుళాయిల కోసం పార్టీల మధ్య విభేదాలు
కుళాయిల కోసం పార్టీల మధ్య విభేదాలు

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో రెండు పార్టీల మధ్య పోరు గ్రామస్థులకు తాగునీరు లేకుండా చేసింది. తెదేపా ప్రభుత్వ హయంతో చీడివలస పంచాయితీ గంగంపేట గ్రామానికి తాగు నీరందించేందుకు 2017లో పదకొండు వీధి కుళాయిలు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా అదే ఏడాది మరో 4 కుళాయిల ఏర్పాటుకు పంచాయితీ అధికారులు తీర్మానించారు. ఈ సంవత్సరం జూలై చివరి వారంలో అధికార పార్టీ ఆధ్వర్యంలో 5 కుళాయిల ఏర్పాటుకు పనులు చేపట్టారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇవి కాస్త ముదరడంతో గత 2 నెలలుగా గ్రామానికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఎంపీడీవో సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన 4 కుళాయిలను పోలీసుల సాయంతో మూసివేత పనులు చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఇదీ చూడండి:
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ప్రశాంత్​రెడ్డి...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.