కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలని పేర్కొంటూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శుక్రవారం పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. సీఐ ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు లోకనాథం, సూర్యనారాయణ యమధర్మరాజు, యమభటుడు వేషధారణలు ప్రదర్శించారు. భౌతిక దూరం పాటించాలని, అత్యవసర సమయంలో తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మాస్కులు ధరించాలని, పోలీసులకు సహకరించాలని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి :