శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి మైలపల్లి రాజు తెలుగుదేశం కార్యకర్త కాగా, కొడుకు సాయిదిలీప్ జనసేన కార్యకర్త. బుధవారం సాయిదిలీప్ నిశ్చితార్థం జరుగుతున్న సమయంలోనే పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా ఎందుకు పోస్టింగ్లు పెడుతున్నావంటూ ప్రశ్నిస్తే... తనపై ఈ తండ్రికొడుకులు దాడి చేశారంటూ అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టెక్కలి సీఐ ఆర్.నీలయ్య ఈ విషయంపై విచారణ చేపట్టి రాజు, సాయిదిలీప్ను అరెస్టు చేశారు. వీరిపై ఐటీ యాక్టు 41 కింద కేసులు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు పెట్టారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు ఈ అరెస్టును ఖండించారు. సాయిదిలీప్కు ఈనెల 30న వివాహం జరగనుంది.
ఇదీ చదవండి