ETV Bharat / state

పోలీస్ స్టేషన్​లో యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం - latest news in santhakaviti police station news

పోలీస్ స్టేషన్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

one person attempt to suicide in santhakaviti police station
పోలీస్ స్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 29, 2020, 10:05 AM IST

పోలీస్ స్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి పోలీస్ స్టేషన్​లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాలాడ గ్రామానికి చెందిన పాత నేరస్థుడు సూర్యనారాయణ యాసిడ్ తాగాడు. పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓ చోరీ కేసులో సూర్యనారాయణను విచారణ చేస్తున్న సమయంలో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.

మండవకురిటిలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు గస్తీ నిర్వహించిన సమయంలో పాత నేరస్థుడైన కుప్పిలి సూర్యనారాయణ లేకపోవటంపై.. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్​కు పిలిపించారు. ఆ సమయంలో బాత్​రూమ్​కు వెళ్తానని చెప్పి, అక్కడ ఉన్న మిక్స్ క్లీనింగ్ యాసిడ్ తాగిన సూర్య నారాయణ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులను భయపెట్టేందుకే సూర్యనారాయణ ఈ ఘటనకు పాల్పడ్డాడని సీఐ శ్రీనివాసులు ఆరోపించారు.

ఇదీ చదవండి:

'ప్రాణాలు పోయినా భూములు వదులుకోం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.