జిల్లాల పునర్విభజన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ఆ ప్రాంత జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి భౌగోళిక స్వరూపంగా ఉన్న పాలకొండను ఎదో ఒక జిల్లాతో అనుసంధానం చేసి నడిపించే ఆలోచన మంచిది కాదని సాధన సమితి సభ్యులు నూతలపాటి భరత్ భూషణ్ అన్నారు.
నది ప్రవాహక ప్రాంతం, పుష్కలంగా పంటలు పండుతూ, ప్రత్యేకమైన నైసర్గిక స్వరూపం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పాలకొండ ప్రత్యేక జిల్లా సాధన కోసం ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని సాధన సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: