శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం ఎఫ్డీ పేట గ్రామానికి చెందిన వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకొని మృతి చెందింది. గొలివి అప్పమ్మ(90) యంబరాం పోలింగ్ కేంద్రంలో ఉదయం ఓటు వేసింది. పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి చేరుకున్న వృద్ధురాలు.. కాసేపటికి మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి