
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ఆదివారపుపేట కూడలి వద్ద విలువైన ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంలో స్థానికులు అంతా కలిసి ఏటా పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా ఇదే స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకుని మంగళవారం రాత్రి బడ్డీ కొట్టు పెట్టారు. ఇది గమనించిన స్థానికులు దానిని తొలగించారు. అనంతరం వారంతా ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోగా, కొద్ది గంటల వ్యవధిలోనే మళ్లీ ఆ బడ్డీని ఆక్రమణదారులు ప్రభుత్వ స్థలంలో పెట్టారు. దీనిపై స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ...మేజర్ పంచాయతీ ఈవో మోహన్ బాబుకు ఫిర్యాదు చేసి ఆక్రమణలు తొలగించాలని కోరారు.
ఇవీ చదవండి