శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఎన్ సీసీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు 10 రోజుల పాటు డ్రిల్, ఫైరింగ్ నాయకత్వ లక్షణాలు, యోగా, సంస్కృతి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. ప్రతిభ కనబరిచిన ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని కమాండెంట్ కల్నల్ జేపీ.పండా తెలిపారు. ఎన్ సీసీ శిబిరంలో ప్రతిభ కనబరిచిన వారిని ఢిల్లీలో 2020 జనవరిలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:అతి ఏదయినా సమస్యే.. వ్యాయామం సైతం!