శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, బెజ్జిపురం గ్రామంలోని యూత్ క్లబ్‌ను నాబార్డు సీజీఎం సుదీర్ కుమార్ జెన్నవర్ పరిశీలించారు. నాబార్డు ద్వారా పలు స్వచ్ఛంద సంస్థలకు నిధులను మంజూరు చేసి.. అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రైతులు, యువత, స్వయం ఉపాధిని సాధించేందుకు అవసరమైన శిక్షణలు ఇస్తున్నామని అన్నారు. మా తోట పథకంలో భాగంగా జిల్లాలోని వెయ్యి కుటుంబాలకు ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో.. మౌలిక సదుపాయాలకు రూ.1136 కోట్లు, గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల నిధులను మంజూరు చేశామని చెప్పారు. అలాగే పౌర సరఫరాల శాఖకు రూ.4 వేల కోట్లు, చింతలపూడి సాగు నీటి ప్రాజెక్టుకు రూ.1931 కోట్లు, ప్రాధమిక వ్యవసాయ రంగం అభివృద్ధికి రూ.1426 కోట్ల నిధులకు ఆమోదం తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు.. డీజీఎం, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: