ETV Bharat / state

Paddy Purchases: ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే ఉద్యమిస్తాం: ఎంపీ రామ్మోహన్ - ఎంపీ రామ్మోహన్ తాజా వార్తలు

MP Rammohan On Paddy Purchases: వైకాపా సర్కారు ఆర్భాటం చేసేందుకే ధ్యానం కొనుగోలు కేంద్రాలు హడావుడిగా ప్రారంభించారని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోతే తెదేపా తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే ఉద్యమిస్తాం
ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే ఉద్యమిస్తాం
author img

By

Published : Dec 28, 2021, 9:15 PM IST

MP Rammohan On Paddy Purchases: ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే తెదేపా తరఫున ఉద్యమిస్తామని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణతో కలిసి శ్రీకాకుళం కలెక్టర్​ శ్రీకేశ్ లాఠకర్​కు వినతిపత్రం అందజేశారు.

తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు ఉండేవే కాదన్న ఎంపీ.. వైకాపా సర్కారు ఆర్భాటం చేసేందుకే ధ్యానం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారన్నారు. రైతులను ఈ రకంగా అన్యాయం చేయటం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. సంక్రాంతి పండుగ ముందే డబ్బులు రైతులకు ఖాతాలో జమయ్యేలా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Sajjala On BJP: మా ప్రభుత్వంపై భాజపా నేతల ఆరోపణలు అనుచితం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.