ETV Bharat / state

తెదేపాకు అనుకూలుడనే కక్షతోనే వినోద్‌పై అక్రమ కేసులు: ఎంపీ రామ్మోహన్‌ - Srikakulam District Palasa Latest News

వైకాపా సర్కారు 19 నెలల పాలనలో దౌర్జన్యాలు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా ఆరాచక పాలన నడుస్తోందన్న ఆయన.. సోషల్ మీడియా కార్యకర్తపై తప్పుడు కేసు పెట్టారన్నారు.

తెదేపాకు అనుకూలుడనే కక్షతోనే వినోద్‌పై అక్రమ కేసులు: ఎంపీ రామ్మోహన్‌

author img

By

Published : Jan 16, 2021, 5:21 AM IST

19 నెలల పాలనలో ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు పెట్టడం తప్ప వైకాపా ప్రభుత్వం సాధించేదేమీ లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం కార్యకర్త వినోద్‌ అరెస్టును ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీపై అభిమానంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారన్న అక్కసుతోనే తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. వినోద్‌ అరెస్టుకు నిరసనగా.... కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఎంపీ.... ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పాలని డీఎస్పీని ప్రశ్నించారు. వినోద్‌ ఆచూకీపై ప్రశ్నిస్తే... పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

'వైకాపాతో పోలీసులు కుమ్మక్కై విచ్చలవిడిగా అక్రమ కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.