రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో వైఎస్సార్ జగనన్న కాలనీలు, గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.
ఇప్పటికే గృహ నిర్మాణాలకు రూ.200 కోట్లు మంజూరు చేశామని.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇల్లు నిర్మించిన తర్వాత బిల్లు చెల్లించకపోవడం మా ప్రభుత్వ హాయాంలో ఉండదని మంత్రి ముక్తకంఠంతో చెప్పారు. గృహనిర్మాణ దారులకు చెల్లించాల్సిన రూ.1400 కోట్లు బిల్లులను సీఎం జగన్ చెల్లించారని మంత్రి గుర్తుచేశారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సిదిరి అప్పలరాజు, నియోజకవర్గం ఎమ్మెల్యేలు, ఎంపీ పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
Suicide: పెళ్లి చేసుకోమని యువకుడి వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య