Minister Botsa Satyanarayana fire on Teachers: తమ స్కూళ్లలో బోధన సరిగ్గా లేదని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండు ఫొటోల అప్‌లోడ్ కోసం తరగతి బోధన ఆపడం సరికాదు. దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పండి..’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని కరకాంలో గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం అధికారులతో సభ నిర్వహించారు. ఈ సమయంలో పిల్లలకు ఉపాధ్యాయులు సరిగా చదువు చెప్పడం లేదని, అందుకే కొందరు టీసీలు తీసుకొని ఇతర బడులకు వెళ్లిపోయారని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన ఎందుకు చెప్పడం లేదని అడిగారు. ఫొటోలు అప్‌లోడ్ చేయాలని, ఇంటర్నెట్ సిగ్నల్స్ అందడం లేదని.. ఇలా ఉపాధ్యాయులు రకరకాల కారణాలు చెబుతున్నారని స్థానికులు బదులిచ్చారు. దీంతో మండల ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారి ఎస్.భానుప్రకాశ్‌ను వివరణ కోరి, పాఠాలు చెప్పని ఉపాధ్యాయులకు మెమో ఇవ్వాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: