శ్రీకాకుళం జిల్లాలో ఐదు వేల మంది కరోనా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ చర్యలపై వైద్యాధికారులతో మంత్రి అప్పలరాజు ప్రభుత్వ వైద్య కళాశాలలో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తున్నామన్నారు. జీజీహెచ్‌లో అన్ని వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి.. తనకు కరోనా సోకినా ఇక్కడే వైద్యం చేయించుకుంటాని స్పష్టం చేశారు. కరోనా రోగులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే.. విశాఖపట్నంలో మూడు వందల పడకలను అందుబాటులో ఉంచామని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం... 48 గంటల డెడ్లైన్: చంద్రబాబు