ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రి.. ఉదయం గం.11.35 ని లు.. వైద్యులెవరు లేరు.. ఖంగు తిన్న మంత్రి

Minister Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి వచ్చిన మంత్రి అప్పలరాజుకు.. చుక్కెదురైంది. ఉదయం పదకొండున్నర సమయంలోనూ వైద్యులెవరు లేకపోవడంతో కంగుతిన్నారు. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన మంత్రి .. విధుల్లో అలసత్వం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

Minister Appalaraju
మంత్రి అప్పలరాజు
author img

By

Published : Sep 24, 2022, 7:55 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన మంత్రి సిదిరి అప్పలరాజుకు చుక్కెదురైంది. ఇవాళ ఉదయం 11.35 నిమిషాలకు ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తనిఖీ చేయడంతో ఆశ్చర్య పరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ పనిచేస్తున్న వైద్యులందరికీ ప్రైవేట్ క్లినిక్​లు ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ వేసి సొంత క్లినిక్​లకు వెళ్లిపోవడం సాధారణం అయిపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి అప్పలరాజు ఆసుపత్రిని తనిఖీ చేశారు. మంత్రి వెళ్లేసరికి ఆసుపత్రిలో ఏ వైద్యుడూ లేకపోవడంతో ఫోన్ చేసి వాళ్లను పిలిపించి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అంతా తిరిగి మౌలిక సదపాయాలను పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు. వైద్యులపై కచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి అప్పలరాజు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.